ఆందోళనలు అంటే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ ప్రాంగణం మారుమోగుతుంది. అయితే పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన ఆ విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేపట్టారు. ఆ మూగ, చెవిటి విద్యార్థులు ప్లకార్డులతో సైలెంట్ గా ఆందోళన చేపట్టారు. చండీగఢ్ లోని సెక్టార్ 19 లోని వాటికా స్పెషల్ స్కూల్ కు చెందిన మూగ, బధిర విద్యార్థులు సమస్యల సాధనకు ఉద్వేగ ప్రసంగాలు, గొంతు చించుకుంటూ కేకలు వేయాల్సిన అవసరం లేదని మౌనంగానే నిరసనతో నిరూపించారు.