loader

తెలంగాణలో కమలం వికసించే రోజు ఎంతో దూరంలో లేదు…: నితిన్ నబీన్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఉద్యమ ఆశయాలు ఇంకా నెరవేరలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్  అన్నారు. తెలంగాణ వేగవంతమైన అభివృద్ధిని సాధించేందుకు ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పాటుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు  పిలుపునిచ్చారు. నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం తెలంగాణకు వచ్చారు. ఈ సందర్బంగా రంగారెడ్డి రూరల్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలోని 8 బీజేపీ కార్యాలయాలను నితీన్ నబీన్ వర్చువల్‌గా ప్రారంభించారు.

టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం..

T20 ప్ర‌పంచ‌క‌ప్ లో భార‌త్ పోరాటం ముగిసింది. త‌ప్ప‌క నెగ్గాల్సిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో వ్యూహాత్మ‌క త‌ప్పిదాలతో ప‌రాజ‌యం పాలైంది.  ఆదివారం ప్ర‌ఖ్యాత లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో మైటీ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. అంత‌కుముందు టాస్  గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా..20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 170 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఛేజింగ్ ను ఆసీస్ ఈజీగా కేవ‌లం 19  ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 172 ప‌రుగులు చేసి గెలుపొందింది.

హర్మన్‌ప్రీత్ సంచలనం.. ఒకటి, రెండు కాదు..ఏకంగా 4 రికార్డులు బ్రేక్ చేసిన లేడీ రోహిత్..!

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 2కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా యాభై పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా జట్టుపై టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఉమ్మడిగా ఆరో స్థానాన్ని దక్కించుకుంది.

వాట్సప్‌ వెబ్‌ యూజర్లకు Cert-In అలర్ట్‌

వాట్సప్ వెబ్, డెస్క్టాప్ యూజర్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మాల్వేర్ను జొప్పించే ప్రయత్నం చేస్తున్నారని కంప్యూటర్  ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (Cert-In) హెచ్చరించింది. మీ డివైజ్ ను అనధికారికంగా యాక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని  తెలిపింది. స్నేహితుడు, సహోద్యోగి, కుటుంబ సభ్యులు పంపే అటాచ్మెంట్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని యూజర్లకు  సూచించింది. వాట్సప్ డెస్క్టాప్, వాట్సాప్ వెబ్ యూజర్లే లక్ష్యంగా ఈ మాల్వేర్ అటాక్ జరుగుతోందని Cert-In తెలిపింది.

కేంద్రానికి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి పండించే రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్ర రైతులకు అండగా నిలవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం ఒక లేఖ రాశారు. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల వల్ల మ్యాంగో పల్ప్ (మామిడి గుజ్జు) ఎగుమతులు నిలిచిపోయాయని, దీని ప్రభావం స్థానిక మార్కెట్‌పై తీవ్రంగా పడిందని ఆయన లేఖలో వివరించారు.

అడ్డు వస్తే మూసీలో వేసి తొక్కుతా.. సీఎం రేవంత్ వార్నింగ్

ప్రతిష్టాత్మకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరు అడ్డుకున్నా వదిలిపెట్టేది లేదని నల్గొండ పర్యటనలో సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. “మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడినా, ఆఖరికి ఆత్మహత్యలకు పాల్పడతామని బెదిరించినా వెనక్కి తగ్గేదే లేదు.. అడ్డువచ్చిన వారిని మూసీలోనే వేసి తొక్కుతాం” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం  రేపుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పరివాహక ప్రాంతాల ప్రజల భవిష్యత్తును మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ఎలాంటి  రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

వెనిజులాలో1,430కు చేరిన మృతుల సంఖ్య

వెనిజులాను వణికించిన వరుస భూకంపాల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.  ఇప్పటివరకు 1,430 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 68,900 మంది ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. భూకంపం  సంభవించి మూడు రోజులు గడిచినా సహాయక చర్యలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ప్రజలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు పారలు, తాళ్లు, భారీ యంత్రాలు, అవసరమైన చోట ఖాళీ  చేతులతోనే […]

అమెరికా వరదల్లో కొట్టుకుపోయిన ఏపీ యువకుడు

ఏపీలోని బాపట్ల జిల్లా దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేశ్ అమెరికాలోని ఒమాహా నగరంలో నివాసం  ఉంటున్నారు. కాన్సాస్లోని వెల్లింగ్టన్ సమీపంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో ఆయన కొట్టుకుపోయారు. ఈ ఘటనపై  పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాశారు. తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని.. ఈమేరకు  అక్కడి ఎంబసీతో మాట్లాడాలని రాష్ట్ర మంత్రి లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.

లడఖ్ పాంగాంగ్ సరస్సు వద్ద పర్యాటకుల ఓవరాక్షన్.. రూ.2 లక్షల జరిమానా

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించి, అక్రమంగా ఆఫ్ రోడింగ్ విన్యాసాలు చేసిన నలుగురు పర్యాటకులకు లడఖ్ వన్యప్రాణి    విభాగం భారీ జరిమానా విధించింది.  వేర్వేరు నాలుగు ఘటనల్లో ఒక్కో పర్యాటకుడికి రూ. 50,000 చొప్పున మొత్తం రూ. 2 లక్షల జరిమానా వేసింది. అంతేకాకుండా వారి  వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు. లడఖ్ చరిత్రలోనే పర్యాటకులపై ఇలాంటి అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం ఇదే  మొదటిసారి కావడం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON