“ఇడుపు కాయితం” అంటే అర్థం తెలియదంటూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారన్న కవిత.. అలాంటి వాళ్లు పవన్ కళ్యాణ్‌ను అడిగితే ఆయన అర్థం చెప్తారంటూ జనసేనానిపై సెటైర్లు వేశారు. తెలంగాణ భాషను అవమానించినందుకే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్న కవిత.. మరోసారి ఇలాంటి వెకిలి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని సూచించారు. కవిత చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, ఎమ్మెల్యే బొలిశెట్టి స్పందించారు. చిప్ప కూడు అనే పదానికి అర్థం ఏమిటో కల్వకుంట్ల కవిత.. తెలంగాణ ప్రజలకు చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు.