ప్రతిష్టాత్మకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరు అడ్డుకున్నా వదిలిపెట్టేది లేదని నల్గొండ పర్యటనలో సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. “మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడినా, ఆఖరికి ఆత్మహత్యలకు పాల్పడతామని బెదిరించినా వెనక్కి తగ్గేదే లేదు.. అడ్డువచ్చిన వారిని మూసీలోనే వేసి తొక్కుతాం” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పరివాహక ప్రాంతాల ప్రజల భవిష్యత్తును మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.