కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించి, అక్రమంగా ఆఫ్ రోడింగ్ విన్యాసాలు చేసిన నలుగురు పర్యాటకులకు లడఖ్ వన్యప్రాణి విభాగం భారీ జరిమానా విధించింది. వేర్వేరు నాలుగు ఘటనల్లో ఒక్కో పర్యాటకుడికి రూ. 50,000 చొప్పున మొత్తం రూ. 2 లక్షల జరిమానా వేసింది. అంతేకాకుండా వారి వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు. లడఖ్ చరిత్రలోనే పర్యాటకులపై ఇలాంటి అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.