“గ్రామాల్లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు అసూయతో రగిలిపోతున్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో విలాసవంతమైన ఫార్మ్‌హౌస్‌లు కట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. పేదవాడి సొంతింటి కష్టాలు వారికి పట్టలేదు” అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వందలాది మంది వీరుల త్యాగాల ఫలమైన తెలంగాణను తామే తెచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కానీ నిజంగా పెట్రోల్ పోసుకుని ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారి బలిదానాన్ని ఏమనాలని నిలదీశారు.