నల్గొండలోని ప్రగతి పనులకు భూమిపూజ చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దశాబ్ద కాలం పాటు అధికార పీఠాన్ని అనుభవించి తెలంగాణను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కోలుకోలేని విధంగా బహిష్కరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎందరో వీరుల బలిదానాలు, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే పదవుల సుఖాలను అనుభవించిందని ఆయన ఆరోపించారు