T20 ప్రపంచకప్ లో భారత్ పోరాటం ముగిసింది. తప్పక నెగ్గాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో వ్యూహాత్మక తప్పిదాలతో పరాజయం పాలైంది. ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మైటీ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా..20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ ను ఆసీస్ ఈజీగా కేవలం 19 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసి గెలుపొందింది.