loader

ప్రపంచవ్యాప్తంగా గడ్డిమందు నిషేధం దిశగా అడుగులు.. తెలంగాణ బాటలోనే అగ్రరాజ్యం అమెరికా

మానవ ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ (Paraquat) గడ్డిమందును  ప్రపంచవ్యాప్తంగా నిషేధించే ప్రక్రియ మరింత వేగవంతమైంది. తాజాగా, అగ్రరాజ్యం అమెరికాలోని వర్మాంట్ రాష్ట్రం ఈ గడ్డిమందుపై పూర్తి నిషేధం విధిస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పారాక్వాట్ అనేది అత్యంత విషపూరితమైన రసాయనం. ఇది చాలా తక్కువ పరిమాణంలో శరీరంలోకి ప్రవేశించినా అంతర్గత అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో క్షణికావేశంలో దీనిని తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

అయోధ్య రామమందిరం విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదు

సంచలనం కలిగిస్తోన్న అయోధ్య రామమందిరం విరాళాల్లో అక్రమాల అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఆలయ ట్రస్ట్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 8 మందిపై BNS సెక్షన్లు 306, 316(5), 317(4) ,317(5), 61, 3(5) కింద FIR నమోదు చేశారు. పోలీసుల అదుపులో ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారు.  ఆభరణాలు చోరీ చేస్తుండగా సీసీ టీవీలో స్పష్టంగా రికార్డయింది. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఆభరణాలు, […]

ఈసారి 69 అడుగుల ఖైరతాబాద్ బడా గణేష్.. పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో..!

ఈసారి ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించే మహా గణపతి నమూనా పోస్టర్‌ను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఇవాళ ఆవిష్కరించింది. ఈ  క్రమంలోనే ఘనంగా కర్రపూజను నిర్వహించింది. ఈసారి 69 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని.. పంచముఖ సంకటహార మహా గణపతి రూపంలో  తయారు చేయనున్నారు. ఈ విగ్రహ నిర్మాణం పూర్తి కావడానికి 82 రోజులు పట్టనుంది. ఈసారితో ఖైరతాబాద్ ఉత్సవాలకు 72 ఏళ్లు పూర్తి  కానున్నాయి. సెప్టెంబర్ 14న వినాయక చవితి జరగనుంది

ఏం సాధించావని సువర్ణ అధ్యాయం.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ధ్వజం

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినందుకు  సంబురాలు చేసుకోవడం పక్కనపెట్టి.. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీ కెనాల్ కోసం సుంకేసుల వద్ద ఆంధ్రా ప్రభుత్వం ఏకంగా 39 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ పరిమితికి మించి వాడుకుంటున్న తీరును రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

కామారెడ్డిలో అక్రమ ఆయుధాల ముఠా గుట్టురట్టు

కామారెడ్డి జిల్లాలో ఆపరేషన్ కవచ్ లో భాగంగా అటవీ జంతువులను వేటాడుతున్న ఎనిమిది మంది ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి  నాటు తుపాకులు, పేలుడు పదార్థాలు, వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు..తనిఖీల్లో వారి వద్ద 5 నాటు తుపాకులు, గన్ పౌడర్, పొటాష్,  స్టీల్ పెలెట్స్, ఫెల్ట్స్ వంటి వేట సామగ్రి లాభమైంది. మోటర్ సైకిళ్లను సీజ్ చేశారు. వారి వద్ద నుంచి 3 చాప్స్, 1 ఎయిర్ గన్, 3 ట్రిగ్గర్  మెకానిజంలు, స్టీల్ […]

ఏపీ ఉద్యోగుల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణకు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం మరింత సమయం కల్పించింది. పోస్టుల ఫ్రీజింగ్, కేడర్ మార్పులపై అమలులో ఉన్న పరిమితులను జూలై 5, 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 25తో ముగియాల్సి ఉండగా, స్థానిక కేడర్ల ఏర్పాటు  ప్రక్రియను పూర్తి చేసేందుకు శాఖలకు అదనపు సమయం అవసరమని భావించి  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  అలాగే శాఖల వారీగా DPC సమావేశాలను త్వరితగతిన నిర్వహించి […]

పాస్ పోర్టులపై కేంద్రం మరో షాక్- జూలై 1 నుంచి ఫీజుల పెంపు, తత్కాల్ ఇలా..!

పాస్ పోర్టుల దరఖాస్తులతో పాటు తత్కాల్ ఫీజుల్ని కూడా పెంచుతూ కేంద్రం ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చింది. సాధారణ విభాగంలో 36 పేజీల  కొత్త పాస్‌పోర్ట్ లేదా పాస్‌పోర్ట్ పునరుద్ధరణ (రీ-ఇష్యూ) ఫీజుల్ని పెంచారు. పాస్ పోర్టు దరఖాస్తు ఫీజు రూ.2,500గా నిర్ణయించారు. అలాగే తాజా  ఫీజుల విధానం ప్రకారం ‘తత్కాల్’ విభాగంలో ఫీజును రూ.5,000గా నిర్ణయించారు.  అలాగే 60 పేజీల పాస్‌పోర్ట్ కోసం, సాధారణ దరఖాస్తులకు రూ. 3,500, తత్కాల్ దరఖాస్తులకు రూ. 6,000 చొప్పున ఫీజు […]

కన్నడ నటి కృషి తపండా ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కృషి తపండా నివాసంలో ఓ వ్యాపారవేత్త  ప్రాణాలు తీసుకోవడం  స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బెంగళూరులోని ఆర్‌.ఆర్‌. నగర్‌లో ఉన్న ఆమె అపార్ట్‌మెంట్‌లో వైశాఖ్ (33) అనే వ్యాపారవేత్త  బుధవారం రాత్రి ఉరివేసుకుని విగతజీవిగా మారారు గత ఫిబ్రవరి నెలలో జరిగిన రూ. 7 కోట్ల భారీ దోపిడీ కేసులో వైశాఖ్ నిందితుడిగా  ఉన్నాడని,  ఆ కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్లు […]

ప్రభుత్వ ఉద్యోగులకు.. ఉచితంగా రూ.1 కోటి ప్రమాద బీమా

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు కీలక హామీలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకర్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రమాదాల్లో మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల బీమా  సొమ్ము అందించడంతో ఆ పథకం విజయవంతమైందని గుర్తుచేశారు. అదే నమూనాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విస్తరించాలని  నిర్ణయించినట్లు వెల్లడించారు.

బహు భార్యత్వం ఉండాల్సిందే.. ఎన్సీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ఖురాన్ ప్రకారం బహు భార్యత్వం ఆచరించడం తప్పేం కాదని మహారాష్ట్రలోని ఎన్సీపీ ఎమ్మెల్యే సనా మాలిక్ అన్నారు. దేశంలో ముస్లింలు ఈ విధానం పాటించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సనా మాలిక్ చేసిన వ్యాఖ్యలు గగ్గోలు పుట్టించాయి. బహుభార్యత్వం కేవలం ముస్లింలోనే ఉందా.. ఇతర మతాల్లో లేదా.. అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. నిషేధించడమేంటన్నారు. అలాగే, ట్రిపుల్ తలాక్ రద్దును కూడా ఆమె తప్పుబట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON