ఖురాన్ ప్రకారం బహు భార్యత్వం ఆచరించడం తప్పేం కాదని మహారాష్ట్రలోని ఎన్సీపీ ఎమ్మెల్యే సనా మాలిక్ అన్నారు. దేశంలో ముస్లింలు ఈ విధానం పాటించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సనా మాలిక్ చేసిన వ్యాఖ్యలు గగ్గోలు పుట్టించాయి. బహుభార్యత్వం కేవలం ముస్లింలోనే ఉందా.. ఇతర మతాల్లో లేదా.. అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. నిషేధించడమేంటన్నారు. అలాగే, ట్రిపుల్ తలాక్ రద్దును కూడా ఆమె తప్పుబట్టారు.