కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలోని తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో గురువారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ.51 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్ వే (క్రస్ట్) గేట్లను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కలిసి అధికారికంగా ప్రారంభించారు.