తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ కేవలం ఒక టెక్నికల్ విజయం మాత్రమే కాదని, మూడు రాష్ట్రాల కరువు జిల్లాల సమస్యల పరిష్కారానికి పడిన కీలక అడుగని అభివర్ణించారు రాష్ట్రాల మధ్య జల వివాదాల పంచాయతీలు పక్కనబెట్టి, కేవలం రైతుల శ్రేయస్సు కోసమే సమస్యలను పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు చట్టబద్ధంగా రావలసిన 10 టీఎంసీల నీరు ఇంకా రావడం లేదని ప్రస్తావిస్తూ..తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు.