ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. “దేశంలోని నదులను అనుసంధానం చేయాల్సి ఉంది. గంగ, కావేరిని అనుసంధానం చేస్తే భారత్ అపబుల్గా దూసుకెళ్తుంది. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి-కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలి. మూడు రాష్ట్రాల హక్కులను కేంద్రం పరిరక్షించాలి. హక్కుల పరిరక్షణపై కార్యాచరణ రూపొందించాలి” అని చంద్రబాబు అన్నారు.