చేవెళ్ల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందేమో నేను గుంపు మేస్త్రీని రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని ఫోజులు కొట్టిండు. ఇవాళ రియల్ ఎస్టేట్‌ను ఏం చేసిండు మరి.. బొంద పెట్టిండు.. వంద ఫీట్ల అడుగులో పాతిపెట్టే పని చేసిండని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్లు, చెల్లెళ్లందరూ ఇవాళ దివాళా తీసే పరిస్థితి వచ్చిందన్నారు.