కాంగ్రెస్ అధినేత ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 51 ఏళ్లు నిండిన సందర్భంగా ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ మన రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. సమయంలో పౌర స్వేచ్ఛల నిలిపివేత, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సంఘ సేవకుల అరెస్టులు, అలాగే మన ప్రజాస్వామ్యానికి పునాదులైన సంస్థలపై దాడి జరిగాయని చెప్పారు. దేశ చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటైన ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య విలువలను దృఢంగా పరిరక్షించిన వారందరికీ నేడు నివాళులర్పిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు.