ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో వైసీపీ నేతలు తోట నరసింహం, తోటత్రిమూర్తులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌ను కీలుబొమ్మల ఆడుకుంటున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ పై అంత ప్రేమే ఉంటే కచ్చితంగా సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మీడియా ముఖ్యంగా పేర్కొన్నారు. వైసీపీకి సంబంధించిన కాపు నేతలు ఏదో సమావేశం నిర్వహిస్తే దానిపై మీకెందుకు మండిపాటు అంటూ ప్రశ్నించారు.