స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఇరాన్ శాంతి చర్చల కోసం వెళ్లి పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ఆయనతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పూర్తిగా హతమార్చడానికి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ‘మొసాద్’ ఓ రహస్య కుట్ర పన్నిందని బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, భౌగోళిక రాజకీయ నిపుణుడు పెపే ఎస్కోబార్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే పాకిస్థాన్‌పై సైనిక నిఘా వర్గాలు ఈ అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని ముందే పసిగట్టి అడ్డుకున్నాయని ఎస్కోబార్ వెల్లడించారు.