పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల కొందరు సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కష్టాల్లో ఉండి, మానసిక వేదనతో ఆసరా కోసం ఆశగా పోలీస్ స్టేషన్ల గడప తొక్కే ప్రజల పట్ల మీరు చూపించే ఔదార్యం ఇదేనా?’ అంటూ అధికారులను నిలదీశారు కొన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల ప్రవర్తన అత్యంత ఇబ్బందికరంగా మారుతోందని, ప్రజలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు