వెనిజువెలాలో సంభవించిన భారీ భూకంపంపై యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇలాంటి భారీ భూకంపం గతంలో ఎప్పుడూ సంభవించలేదని, ఈ భూకంప ప్రభావానికి పది వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తెలిపింది. అలాగే మృతుల సంఖ్య లక్ష వరకు పెరిగే అవకాశం ఉందని సంచలన ప్రకటన చేసింది.
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టెలివిజన్ ద్వారా ఆమె దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రాణనష్టం జరిగిన విషయాన్ని ధ్రువీకరించారు.