అరుణాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలతో వరదలు భీబత్సం సృష్టించాయి. లోయర్ సుబన్‌సిరి, కేయి పన్యార్ జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్లు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న తీవ్ర వర్షాల వల్ల పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రోడ్లు, వంతెనలు, ఇతర ప్రజా మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది