సీజేపీని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఉగ్రవాదుల బీ-టీమ్’ అని అభివర్ణించడాన్ని అభిజిత్ తీవ్రంగా తప్పుపట్టారు. తాము ఓట్ల కోసం కాకుండా విద్యార్థుల న్యాయం కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు.తాము, తమ తల్లిదండ్రులు పన్నులు కడుతున్నామని, అలాంటి దేశ పౌరులను ఉగ్రవాదులుగా పిలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో తమ హక్కుల కోసం పోరాడిన రైతులను, వైద్యులను కూడా పాలకులు ఇలాగే దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేశారని గుర్తు చేశారు.