loader

మమ్మల్ని టెర్రరిస్టులు అనడానికి సిగ్గుగా లేదా..?

సీజేపీని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఉగ్రవాదుల బీ-టీమ్’ అని అభివర్ణించడాన్ని అభిజిత్ తీవ్రంగా తప్పుపట్టారు. తాము ఓట్ల కోసం కాకుండా విద్యార్థుల న్యాయం కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు.తాము, తమ తల్లిదండ్రులు పన్నులు కడుతున్నామని, అలాంటి దేశ పౌరులను ఉగ్రవాదులుగా పిలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో తమ హక్కుల కోసం పోరాడిన రైతులను, వైద్యులను కూడా పాలకులు ఇలాగే దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేశారని గుర్తు చేశారు.

నర్సంపేట మండలంలో తాటివనం దగ్ధం

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు తాటివనానికి నిప్పంటించారు. పక్కనే పెట్రోల్ బంకు  ఉండడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన  చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. భారీగా తాటిచెట్లు దగ్ధం కావడంతో తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందని గౌడ  కులస్థులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడినవారు ఎవరై ఉంటారా.. అనేది ఆరా తీస్తున్నారు.

CJP జంతర్ మంతర్ నిరసన 5వ రోజు: అభిజీత్ దిప్కే MeitY ప్యానెల్ ముందు

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జూన్ 24, 2026న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తన నిరసనను 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ  వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, అధికారులపై ఆరోపణలు చేస్తూ, తమ సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడానికి సంబంధించిన ఆదేశాలను చూపించడానికి వారు నిరాకరించినట్లు తెలిపారు.దిప్కే, MeitY ప్యానెల్ ముందు హాజరైనప్పుడు, ఈ చర్యకు కారణం ఏమిటో తెలియజేయలేదు. NEET పేపర్ లీక్ కేసులో కూడా ఇలాంటి గోప్యత ఎందుకు పాటించబడలేదని ఆయన […]

బాబాయ్ ఆశీస్సులు తీసుకున్న అబ్బాయ్..డిప్యూటీ సీఎంను కలిసిన రామ్‌చరణ్!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ఒక అరుదైన, ఆసక్తికరమైన భేటీ జరిగింది.మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో  ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్  డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయనను మంగళగిరి కార్యాలయంలో చరణ్ కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ‘బాబాయ్-అబ్బాయి’ల ప్రత్యేక సమావేశం ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ సర్కిల్స్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Passport ఉన్నా పౌరులు కాదు..! కేంద్రం మరో బిగ్ షాక్..!

పాస్‌పోర్ట్ అనేది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే జారీ చేస్తారని, అయితే, పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టం చేసింది. 14వ ‘పాస్‌పోర్ట్ సేవా దివస్’ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. ఆధార్  పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది కేవలం గుర్తింపు పత్రం మాత్రమేనని తేల్చింది. అలాగే ఓటర్  ఐడి కార్డును కూడా పౌరసత్వ పత్రంగా పరిగణించట్లేదు.

నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!

తన కుమారుడి మరణానికి కారణమైన వారిలో కేవలం సీఐ మాత్రమే లేరని, మరికొంతమంది పోలీసులు కూడా సాయికృష్ణపై దాడి చేశారని  విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “నా కుమారుడిని ఇంకా కొంతమంది పోలీసులు కొట్టారు. వాళ్లందరినీ వెంటనే అరెస్టు చేయాలి”  అని ఆమె డిమాండ్ చేశారు. సీఐ నాగరాజుతోపాటు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ కూడా తమ ఆవేదనను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆమె  వాపోయారు. కోర్టుకు కూడా తప్పుడు సమాచారం అందించారని, అన్నింటికీ కచ్చితంగా సమాధానం చెప్పాలని […]

SIR లో పేరు తీసేస్తే రేష‌న్ ఇవ్వ‌రా..? : సుప్రీంకోర్టు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నుంచి పేరు తొలగించబడిన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎస్ఐఆర్‌లో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా  అంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఇది రాష్ట్ర పరిధిలోని ప్రత్యేక కారణాలతో కూడిన అంశం కాబట్టి.. ఆర్టికల్ 32 కింద నేరుగా  సుప్రీంకోర్టుకు రాకుండా ముందుగా కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అన్నెసీ ఫిల్మ్ ఫెస్టివల్ ‘లో రాజమౌళి సందడి

ఫ్రాన్స్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో భారతీయ సినిమా ఖ్యాతి మరోసారి వెలిగిపోయింది. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న సరికొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’. ఈ చిత్రం ఈ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన Work in Progress ప్యానల్ డిస్కషన్‌కు అధికారికంగా ఎంపికవడంతో చిత్ర యూనిట్ అంతా అక్కడ  హాజరైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలను, యానిమేషన్ రంగంలో తాము తీసుకుంటున్న జాగ్రత్తలను అంతర్జాతీయ […]

వైభవ్ తమ్ముడి వీరబాదుడు.. 119 బంతుల్లో 168

ఐపీఎల్ సీజన్ జరిగినంత కాలం వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకున్నారంతా. ఇప్పుడు ఆ ఇంటి నుంచే మరో చిచ్చర పిడుగు వార్తల్లోకెక్కాడు. వైభవ్ సూర్యవంశీ తమ్ముడు పదేళ్ల ఆశీర్వాద్ సూర్యవంశీ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. తాజాగా బిహార్ జరిగిన ఓ లోకల్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. 119 బంతుల్లో 168 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇందులో 19 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. తమ్ముడు  సాధించిన ఘనతను వైభవ్ సూర్యవంశీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON