ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ఒక అరుదైన, ఆసక్తికరమైన భేటీ జరిగింది.మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయనను మంగళగిరి కార్యాలయంలో చరణ్ కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ‘బాబాయ్-అబ్బాయి’ల ప్రత్యేక సమావేశం ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ సర్కిల్స్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.