పవన్ కల్యాణ్ వారాహి దీక్ష చేపట్టారు. ఆయన ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్షను ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఆయన ఈ దీక్షను క్రమం తప్పకుండా యేటా స్వీకరిస్తున్నారు. ఈ దీక్షా కాలంలో పవన్ నిత్యం కఠిన నియమాలు అనుసరిస్తారు.దీక్షా కాలంలో నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం తీసుకుంటూ విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలను ధరిస్తూ ఉంటారు.అదే విధంగా రాజకీయంగానూ పవన్ జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు సిద్దం అవుతున్నారు.