డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్న సైబర్ మోసగాళ్ల నెట్వర్క్ను ఛేదించేందుకు సీబీఐ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ చక్ర-VI కింద దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 80కి పైగా ప్రాంతాల్లో ఏకకాల సోదాలు నిర్వహించింది. దర్యాప్తులో సుమారు రూ.2 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చాయని.. సోదాల సమయంలో మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు, బ్యాంకు రికార్డులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.ఈ ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయని పేర్కొంది.