ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకుంటున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రాజెక్టును హిందూపురం ఎమ్మెల్యే, హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ క్షేత్రస్థాయిలో స్వయంగా సందర్శించారు. నిర్మాణ స్థలంలో సైట్ ఇంజనీర్లు, ప్రతినిధులతో కలిసి ల్యాండ్ మ్యాప్లు, కన్స్ట్రక్షన్ డిజైన్లను నిశితంగా పరిశీలించిన ఆయన.. ప్రాజెక్టు గడువుకు సంబంధించిన కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు. అమరావతి బసవతారకం ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశ నిర్మాణ పనులను 2028 నాటికి పూర్తి చేసి, రోగులకు సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.