కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ కృషి తపండా నివాసంలో ఓ వ్యాపారవేత్త ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బెంగళూరులోని ఆర్.ఆర్. నగర్లో ఉన్న ఆమె అపార్ట్మెంట్లో వైశాఖ్ (33) అనే వ్యాపారవేత్త బుధవారం రాత్రి ఉరివేసుకుని విగతజీవిగా మారారు గత ఫిబ్రవరి నెలలో జరిగిన రూ. 7 కోట్ల భారీ దోపిడీ కేసులో వైశాఖ్ నిందితుడిగా ఉన్నాడని, ఆ కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.