సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినందుకు సంబురాలు చేసుకోవడం పక్కనపెట్టి.. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీ కెనాల్ కోసం సుంకేసుల వద్ద ఆంధ్రా ప్రభుత్వం ఏకంగా 39 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ పరిమితికి మించి వాడుకుంటున్న తీరును రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.