పాస్ పోర్టుల దరఖాస్తులతో పాటు తత్కాల్ ఫీజుల్ని కూడా పెంచుతూ కేంద్రం ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చింది. సాధారణ విభాగంలో 36 పేజీల కొత్త పాస్‌పోర్ట్ లేదా పాస్‌పోర్ట్ పునరుద్ధరణ (రీ-ఇష్యూ) ఫీజుల్ని పెంచారు. పాస్ పోర్టు దరఖాస్తు ఫీజు రూ.2,500గా నిర్ణయించారు. అలాగే తాజా ఫీజుల విధానం ప్రకారం ‘తత్కాల్’ విభాగంలో ఫీజును రూ.5,000గా నిర్ణయించారు. అలాగే 60 పేజీల పాస్‌పోర్ట్ కోసం, సాధారణ దరఖాస్తులకు
రూ. 3,500, తత్కాల్ దరఖాస్తులకు రూ. 6,000 చొప్పున ఫీజు ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు.