ఈసారి ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించే మహా గణపతి నమూనా పోస్టర్‌ను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఇవాళ ఆవిష్కరించింది. ఈ క్రమంలోనే ఘనంగా కర్రపూజను నిర్వహించింది. ఈసారి 69 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని.. పంచముఖ సంకటహార మహా గణపతి రూపంలో తయారు చేయనున్నారు. ఈ విగ్రహ నిర్మాణం పూర్తి కావడానికి 82 రోజులు పట్టనుంది. ఈసారితో ఖైరతాబాద్ ఉత్సవాలకు 72 ఏళ్లు పూర్తి కానున్నాయి. సెప్టెంబర్ 14న వినాయక చవితి జరగనుంది