loader

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దలైలామా పేరు

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో టిబెట్ మత గురువు దలై లామా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.  169 సార్లు ప్రస్తావించినట్లు రిపోర్టులు రావడంతో ఆయన ఆఫీసు స్పందించింది.. ఎక్స్ వేదికగా మీడియా ప్రకటన విడుదల చేశారు. మహిళలు, మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు, ఎప్ స్టీన్ ను తాను ఎన్నడూ కలవలేదని స్పష్టం చేశారు.  పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో జెఫ్రీ ఎఫ్ స్టీన్ తో దలైలామా సమావేశమైనట్లు చూపించడంపై […]

ఆరోగ్యం క్షీణిస్తున్నా జైల్లోనే బంధించి.. బంగ్లాదేశ్‌లో మరో హిందూ నేత మృతి

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ వర్గంపట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నాయకుడు 18 నెలలుగా జైల్లోనే మగ్గుతూ ప్రాణాలు కోల్పోయాడు. అవామీ లీగ్‌ మాజీ నేత, 86 ఏళ్ల రమేషన్‌ చంద్ర సేన్‌ విద్యావేత్త. బంగ్లాదేశ్‌ ఎంపీగా, మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహంచారు. ఏ తప్పూ చేయకున్నా గడిచిన 18 నెలలుగా ఆయన జైల్లో మగ్గుతున్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తున్నదని పలుమార్లు కోర్టుకు వెల్లడించినా బెయిల్‌ మాత్రం రాలేదు. దాంతో ఆయన జైల్లోనే […]

రష్యా చమురు కొనుగోళ్లపై US హెచ్చరిక

రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయకపోతే మరోసారి 25 శాతం టారిఫ్‌లు విధిస్తామని అమెరికా హెచ్చరించడం తీవ్ర వివాదానికి దారితీసింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం తీసుకునే నిర్ణయాలపై విదేశీ దేశం ఒత్తిడి తెస్తుండటంపై రాజకీయ, ఆర్థిక నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా విధిస్తున్న షరతులు భారత్ సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఇక ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఆయన ఉపయోగించిన కఠినమైన పదజాలం కూడా విమర్శలకు గురవుతోంది.

సూడాన్‌లో పారామిలిటరీ డ్రోన్ దాడికి 24 మంది మృతి

సెంట్రల్ సూడాన్‌లో శనివారం నిర్వాసిత కుటుంబాలతో వెళ్తున్న వాహనంపై పారామిలిటరీ గ్రూపు డ్రోన్ దాడి చేయడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారని డాక్టర్ల గ్రూపు వెల్లడించింది. నార్త్ కొర్డోఫాన్ ప్రావిన్స్‌లో రహాద్ సిటీ సమీపాన రాపిడ్ సపోర్టు ఫోర్స్‌స్ ఈ దాడికి పాల్పడ్డాయి. నార్త్ కొర్డోఫాన్ లోని డుబెయికర్ ఏరియా యుద్ధ ప్రాంతం నుంచి తరలిపోతున్న నిర్వాసితులపై ఈ దాడి జరిగిందని డాక్టర్ల గ్రూపు పేర్కొంది.

మసీదులో ఆత్మాహుతి దాడిలో 31 మందికి చేరుకున్న మృతుల సంఖ్య

ఇస్లామాబాద్‌లోని షియా మసీదులో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 31 మంది మరణించగా, 169 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు నగర అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిహాదీ కమ్యూనికేషన్లను పర్యవేక్షించే SITE ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రకారం, తమ ఉగ్రవాదుల్లో ఒకరు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని, పేలుడు చొక్కాను పేల్చివేసి “పెద్ద సంఖ్యలో మరణాలు మరియు గాయాలకు కారణమయ్యారని” IS తెలిపింది.

ఇరుదేశాలకు గ్రేట్ న్యూస్.. ట్రంప్‌నకు కృతజ్ఞతలు: మోదీ

భారత్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు మోదీ. భారత్‌, అమెరికాలకు ఇది గ్రేట్ న్యూస్. ఇరుదేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి ఫ్రేమ్‌ వర్క్‌ ఖరారు చేశాం. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాల కోసం, వ్యక్తిగత నిబద్ధతతో కృషిచేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు కృతజ్ఞతలు.

భారత్ – అమెరికా చారిత్రాత్మక ఒప్పందం..

భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన శకం ఆరంభమైంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాలు చారిత్రాత్మక మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి.మెజారిటీ భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు 50శాతం నుండి 18 శాతానికి తగ్గనున్నాయి. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా గతంలో విధించిన 25శాతం అదనపు సుంకాన్ని ట్రంప్ రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

ఇస్లామాబాద్ మసీదులో భారీ పేలుడు.. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య..!

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేలింది. చాలా మంది మరణించినట్లు సమాచారం. పేలుడు చిత్రాలలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్ గ్రాండ్ మసీదుగా పిలువబడే కస్ర-ఎ-ఖాదీజతుల్ కుబ్రా మసీదులో పేలుడు సంభవించింది. ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

లోయలో పడిన పెళ్లి బృందం బస్సు: 13 మంది మృతి

పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 13 మంది మృతి చెందారు. ఈ సంఘటన నేపాల్ దేశం బైటడి జిల్లా పూర్చౌడి మున్సిపాలిటీ-7లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. 16 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 60 మంది బస్సు భావానే నుంచి బజాంగ్‌కు వెళ్తుండగా బడ్గౌన్ మోడ్ వద్ద బస్సు లోయలో పడింది.

ఎప్‌స్టీన్ ఫైల్స్ కలకలం.. బ్రిటన్ ప్రధాని క్షమాపణలు

లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పలు దస్త్రాలు తాజాగా బ్రిటన్‌లోనూ కలకలం రేపుతున్నాయి. ఈ దస్త్రాల్లో బ్రిటన్ రాయబారి పీటర్ మాండెల్సన్ పేరు కూడా ఉండటంతో తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు తెలిపారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో పీటర్ మాండెల్సన్‌కు అంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉన్నదని తెలియక ఆయన్ను రాయబారిగా నియమించినట్టు బ్రిటన్ ప్రధాని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఎప్‌స్టీన్‌తో స్నేహం వెలుగులోకి రావడంతో బ్రిటన్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON