పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేలింది. చాలా మంది మరణించినట్లు సమాచారం. పేలుడు చిత్రాలలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్ గ్రాండ్ మసీదుగా పిలువబడే కస్ర-ఎ-ఖాదీజతుల్ కుబ్రా మసీదులో పేలుడు సంభవించింది. ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

