భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన శకం ఆరంభమైంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాలు చారిత్రాత్మక మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి.మెజారిటీ భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు 50శాతం నుండి 18 శాతానికి తగ్గనున్నాయి. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా గతంలో విధించిన 25శాతం అదనపు సుంకాన్ని ట్రంప్ రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

