loader

వేగంగా ఏఐ విస్తరణ వేళ..ఆంథ్రోపిక్‌ సీఈవో సంచలన వ్యాఖ్యలు

ఒక సీఈవో చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌ను అతలాకుతలం చేసిపారేస్తున్నాయి. ఆరు నెలలు.. మహా అయితే ఏడాదిలోపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల అవసరం లేకపోవచ్చు.. అంటూ ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడి చెప్పిన మాటలు ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి దాకా ప్రోగ్రామర్లకు సహాయం చేసిన ఏఐ టూల్స్‌.. సహకారం అందించడం కాకుండా.. స్వయంగా కోడ్‌ రాసేస్తున్నాయని అతి త్వరలోనే మొత్తం డెవలప్‌మెంట్‌ ప్రాసెస్‌ను ఏఐ హ్యాండిల్‌ చేయగలదని డారియో అమోడి అంచనా వేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో పోలింగ్ ప్రారంభం- హసీనా పార్టీ లేకుండా తొలి ఎన్నిక ఇదే

ఏడాదిన్నరగా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లో గురువారం 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 2024 ఆగస్టులో విద్యార్థుల భారీ ఉద్యమంతో కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక పాలనకు ఇవి ముగింపు పలకనున్నాయి. ఈసారి 299 పార్లమెంట్ స్థానాలకు 1,981 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రధాన పార్టీ       అవామీ లీగ్‌ లేకుండా ఎన్నికలు జరగడం ఇదే […]

థాయిలాండ్‌లో ఘోరం.. 34 మందిని కాల్చి చంపేశాడు..

దక్షిణ థాయిలాండ్‌లో ఘోరం జరిగింది. బుధవారం మధ్యాహ్నం సోంగ్ఖా హ్యాట్ హెయ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడు జరిపిన కాల్పుల్లో 22మంది చిన్నారులు సహా 34మంది మరణించారు. చాలా మందిని అతను బందీలుగా చేసుకున్నాడు. పాఠశాలలో కాల్పుల మోత వినపడగానే రోడ్డుపై జనాలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

కెనడా స్కూల్లో కాల్పుల కలకలం- నిందితుడితో సహా 10 మంది మృతి

కెనడాలో కాల్పుల కలకలం రేపాయి. బ్రిటిష్ కొలంబియాలో పాఠశాలలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ఈ ఘటనకు కారణమైన నిందితుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టుంబ్లెర్‌ రిడ్జ్‌ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వీరు కూడా స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనతో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని […]

సముద్ర తీరంలో విమానం క్రాష్ ల్యాండింగ్… విమానంలో మొత్తం 55 మంది సేఫ్

సోమాలియాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 55 మందితో ప్రయాణిస్తున్న విమానం మొగడిషు నుండి ప్రయాణం ప్రారంభించిన 15 నిమిషాల తర్వాత విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించాడు. ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు. అయితే విమానం ఎయిర్‌పోర్టులో కాకుండా… హిందూ మహాసముద్రంలోని బీచ్ తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించకపోవడంతో… మిరాకిల్ జరిగినట్టుగా అంతా భావిస్తున్నారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని చెబుతున్నారు

ఎప్‌స్టీన్‌తో విందులో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్.. ఫొటోలు విడుదల

ఎప్‌స్టీన్ చేసిన అరాచకాలలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వివాదంలో ఇప్పుడు ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఒక ఫొటో విడుదలైంది. దీనికి సంబంధించిన మెయిల్‌లో ఈ ఈవెంట్‌ను ‘వైల్డ్’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోలో వీళ్లంతా రాత్రి పూట డిన్నర్ చేస్తుండగా, ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఈ అంశంపై ఇటీవల ఎలాన్ మస్క్ తాను ఎప్పుడూ […]

సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ

ప్రధాని నరేంద్ర మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినియా భారత పర్యటన సందర్భంగా $175 మిలియన్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది. గృహ నిర్మాణం, ఇ-మొబిలిటీ, ఆరోగ్యం, రక్షణ, సముద్ర భద్రత వంటి కీలక రంగాలలో ఈ నిధులు ఉపయోగపడతాయి. అభివృద్ధి భాగస్వామ్యం రెండు దేశాల మధ్య బలమైన పునాది అని మోదీ అభివర్ణించారు.

భారత్ సహా ఇతర దేశాలు మా చమురును కొనకుండా యూఎస్ అడ్డుకుంటోంది- రష్యా ఫైర్

అగ్రరాజ్యం అమెరికాపై రష్యా విమర్శలు గుప్పించింది. చౌకగా లభించే రష్యా చమురును కొనుగోలు చేయకుండా భారత్, ఇతర మిత్ర దేశాలను నిరోధించే ప్రయత్నాలను అమెరికా చేస్తోందని మండిపడింది. అలాగే అధిక ధరలకు యూఎస్ ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేయాలని భారత్, ఇతర దేశాలను అమెరికా బలవంతం చేస్తోందని విమర్శించింది. ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు.

హైబ్రిడ్ మోడల్ లొల్లి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కొత్త ప్లాన్ ఇదే

2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న హైబ్రిడ్ మోడల్ ఒప్పందం 2027 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ గడువును 2031 ఎడిషన్ వరకు పొడిగించాలని పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు కోరుతున్నాయి. ఈ పొడిగింపు జరిగితే, 2031 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లన్నింటినీ కేవలం బంగ్లాదేశ్‌లోనే ఆడే వెసులుబాటు పొందుతాయి. వ్యూహాత్మక డిమాండ్ ద్వారా భవిష్యత్తులో కూడా భారత్‌లో పర్యటించకుండా ఉండేందుకు ఈ రెండు బోర్డులు పావులు […]

హాంగ్‌కాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లాయ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష‌

హాంగ్‌కాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లాయ్‌ కు 20 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. హాంగ్‌కాంగ్ స్థానిక కోర్టు ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. జాతీయ భ‌ద్ర‌తా నేరానికి పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చైనా త‌న వివాదాస్ప‌ద జాతీయ భ‌ద్ర‌త చ‌ట్టం కింద ఈ శిక్ష‌ను విధించింది. జిమ్మీ లాయ్ .. చైనాకు వ్య‌తిరేకంగా పోరాటం చేశారు. యాపిల్ డెయిలీ ప‌త్రిక‌తో చైనాకు వ్య‌తిరేకంగా ఎన్నో క‌థ‌నాలు రాశారు. ఆ ప‌త్రిక‌లో ప‌నిచేసిన మ‌రో ఆరు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON