ప్రధాని నరేంద్ర మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినియా భారత పర్యటన సందర్భంగా $175 మిలియన్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది. గృహ నిర్మాణం, ఇ-మొబిలిటీ, ఆరోగ్యం, రక్షణ, సముద్ర భద్రత వంటి కీలక రంగాలలో ఈ నిధులు ఉపయోగపడతాయి. అభివృద్ధి భాగస్వామ్యం రెండు దేశాల మధ్య బలమైన పునాది అని మోదీ అభివర్ణించారు.

