అగ్రరాజ్యం అమెరికాపై రష్యా విమర్శలు గుప్పించింది. చౌకగా లభించే రష్యా చమురును కొనుగోలు చేయకుండా భారత్, ఇతర మిత్ర దేశాలను నిరోధించే ప్రయత్నాలను అమెరికా చేస్తోందని మండిపడింది. అలాగే అధిక ధరలకు యూఎస్ ఎల్ఎన్జీని కొనుగోలు చేయాలని భారత్, ఇతర దేశాలను అమెరికా బలవంతం చేస్తోందని విమర్శించింది. ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు.

