loader

సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా సుంకాల 15%కి పెంచుతున్నట్టు ప్రకటన

అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాల జీవోను కొట్టివేసిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా సుంకాల రేటును వెంటనే 15%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ట్రూత్ సోషల్ పై సుదీర్ఘ పోస్ట్‌లో కోర్టు తీసుకున్న “హాస్యాస్పదమైన, పేలవంగా రాసిన, అసాధారణమైన అమెరికన్ వ్యతిరేక నిర్ణయం” అని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 10% ప్రపంచ సుంకాన్ని “పూర్తిగా అనుమతి పొందిన, చట్టబద్ధంగా పరీక్షించిన” 15% స్థాయికి పెంచుతామని,”వెంటనే అమలులోకి వస్తుంది”  ఆయన ప్రకటించారు.

17.5 లక్షల యాప్స్ తొలగించిన Google.. 80 వేల మంది డెవలపర్స్‌పై బ్యాన్

ఆండ్రాయిడ్ వినియోగదారుల భద్రతపై Google ఫోకస్ చేసింది. ఈ క్రమంలో Play Storeపై చర్యలు మొదలుపెట్టింది. ప్లే స్టోర్ నుంచి ఏకంగా 17.5 లక్షల కంటే ఎక్కువ అనుమానాస్పద, Fake Appsను ప్లాట్‌ఫారమ్ నుంచి గూగుల్ తొలగించింది. దీంతో పాటు దాదాపు 80,000 డెవలపర్ అకౌంట్స్‌ను పర్మినెంట్‌గా బ్లాక్ చేసింది. గూగుల్ రిమూవ్ చేసిన మెజారిటీ యాప్‌లలో ప్రమాదకరమైన మాల్వేర్ ఉంది. యూజర్లకు సమాచారం లేకుండా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లను సైతం యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంది.

‘భారత్‌ టారిఫ్స్‌ చెల్లిస్తుంది, కానీ అమెరికా చెల్లించదు…’

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం గతంలోని దానికంటే పూర్తిగా భిన్నమైందని, ఇప్పుడు భారత్‌ అమెరికాకు టారిఫ్స్‌ చెల్లిస్తుందని, అమెరికా భారత్‌కు ఎలాంటి సుంకాలు చెల్లించదని  అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, “ఏమీ మారలేదు. వారు సుంకాలు చెల్లిస్తారు. మేము సుంకాలు చెల్లించము.” పాత ఒప్పందాన్ని పూర్తిగా మార్చేశామన్నారు. “ఒప్పందం ప్రకారం భారత్‌ సుంకాలు చెల్లిస్తుంది. ఇది ఇంతకు ముందులాంటి ఒప్పందం కాదు. మేము దానిని మార్చేశాం” అని […]

ట్రంప్ విధించిన టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీం కోర్టు.. అసలు నీకు సుంకాలు విధించే అధికారమే లేదు..

అమెరికా సుప్రీంకోర్టు నేడు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఏకంగా ఆ దేశం అధ్యక్షుడి తీరుని తప్పు పట్టింది. తన మాట వినని ప్రపంచ దేశాలపై అనవసరంగా అధిక సుంకాలను విధించడం అమెరికా చట్టాలకు వ్యతిరేకం అని తేల్చి చెప్పేసింది. అసలు ఆయన విధించిన సుంకాలు చెల్లవని చెప్పింది. అంతేకాదు ఆ సుంకాలను కోర్టు కొట్టేసింది. అలాగే ఈ డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందేనని నొక్కి చెప్పింది. దీంతో అమెరికాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పైకి లేచింది.

అమెరికా ఆధ్వర్యంలోని కీలక కూటమిలో భారత్ చేరిక

రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా వ్యవస్థల భద్రత, కృత్రిమ మేధ అభివృద్ధి కోసం అమెరికా సారథ్యంలో ప్రారంభమైన ప్యాక్స్ సిలికా కూటమిలో శుక్రవారం భారత్ అధికారికంగా చేరింది.15 రకాల లాంథనైడ్స్, స్కాండియమ్, యిట్రియమ్ ఖనిజాలను రేర్ ఎర్త్ ఖనిజాలని పిలుస్తారు. సెమీకండక్టర్, కృత్రిమ మేధ రంగాలకు ఈ ఖనిజాలు అత్యంత కీలకం. అధిక ఖర్చుతో కూడుకున్న సంక్లిష్టమైన ప్రక్రియలతో వీటిని వెలికి తీస్తారు. ఈ ఖనిజాలపై చైనా అధిపత్యాన్ని సవాలు చేసేందుకు అమెరికా ప్యాక్స్ సిలికా కూటమిని […]

ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్జెంటీనాలో భారీ నిరసనలు

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో ఉద్రిక్తత నెలకొంది. అధ్యక్షుడు జేవియర్ మైలీ ప్రవేశపెట్టిన కార్మిక చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మెకు ట్రేడ్ యూనియన్లు (CGT) పిలుపునిచ్చాయి.

యూఏఈలో రంజాన్ క్షమాభిక్షతో 4,700 మంది ఖైదీల విడుదల

ముస్లింల పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్‌లో 1856 మంది ఖైదీలను విడుదల చేస్తూ దుబాయ్‌ రాజు షేఖ్ మొహమ్మద్ బిన్ రాషేద్ ఆదేశాలు జారీ చేశారు. అబుదాబిలో 1440 మంది ఖైదీలను, షార్జాలో 738 మంది, రాస్ అల్ ఖైమాలో 407 మంది, ఫుజిరాలో 125 మంది ఆజ్మాన్‌లో 135 మంది ఖైదీలను విడుదల చేస్తూ పాలకులు హుకుం జారీ చేశారు. సౌదీ అరేబియా, ఖతర్, ఒమాన్ దేశాలు కూడా పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశాయి.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరు.. బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడి అరెస్ట్

ఎప్‌స్టీన్స్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ ఫైళ్లలో బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడు, మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండర్స్ పేరు కూడా ఉంది. ఈ విషయం యూకేలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన ఓ బాధితురాలు ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేసింది.

కరాచీలో భారీ పేలుడు.. 16 మంది దుర్మరణం..

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ నేపథ్యంలో భోజనాలు సిద్దం చేస్తుండగా పాక్ లోని కరాచీలో ఒక అపార్ట్ మెంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సిలిండర్ పేలడం వల్ల ఏకంగా 16 మంది మృతి చెందారు. ఈ ఘటన పెనువిషాదకరంగా మారింది. సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలోని స్థానికంగా ముస్లిం పవిత్ర రంజాన్ మాసం మొదటి రోజున ప్రజలు తెల్లవారుజామున భోజనం సిద్ధం చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో బిల్డింగ్ అంతా కుప్పకూలిపోయింది.

ఢిల్లీ ఎక్స్‌పో సమ్మిట్ గిన్నిస్ రికార్డు

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సు, ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరింది. తాము బాధ్యతాయుతంగా ఈ ఏఐ పరిజ్ఞానం వినియోగిస్తాం, దుర్వినియోగపర్చబోం అని ప్రతిన వహిస్తూ2,50,946 మంది యువజనం ప్రకటించారు. ఇది గిన్నిస్ రికార్డుల్లో చేరిందని రికార్డు నిర్వాహకులు ప్రవీణ్ పటేల్ బుధవారం తెలిపారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఈ భారీ సంఖ్యలో జనం ప్రతిజ్ఞ తీసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON