సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం గతంలోని దానికంటే పూర్తిగా భిన్నమైందని, ఇప్పుడు భారత్ అమెరికాకు టారిఫ్స్ చెల్లిస్తుందని, అమెరికా భారత్కు ఎలాంటి సుంకాలు చెల్లించదని అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, “ఏమీ మారలేదు. వారు సుంకాలు చెల్లిస్తారు. మేము సుంకాలు చెల్లించము.” పాత ఒప్పందాన్ని పూర్తిగా మార్చేశామన్నారు. “ఒప్పందం ప్రకారం భారత్ సుంకాలు చెల్లిస్తుంది. ఇది ఇంతకు ముందులాంటి ఒప్పందం కాదు. మేము దానిని మార్చేశాం” అని అన్నారు.

