loader

లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

లెబనాన్ సరిహద్దుల్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా లక్ష్యంగా జరిపిన భారీ వైమానిక దాడులు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ మెరుపు దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన ఒక సీనియర్ ఫీల్డ్ కమాండర్‌తో సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2024 నవంబర్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతిపెద్ద మరియు అత్యంత భీకరమైన దాడి […]

ఆంథ్రోపిక్ ఒక్క పోస్ట్.. స్టాక్ మార్కెట్ ఢమాల్

కృత్రిమ మేధ స్టార్టప్ ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్‌లు అందించే కంపెనీలకు షాకిచ్చింది. కొన్ని గంటల క్రితం ఆంథ్రోపిక్ చేసిన ఒక్క పోస్ట్ పది బిలియన్ డాలర్ల నష్టాన్ని మోసుకొచ్చింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్‌లో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ తీసుకొస్తున్నట్టు ఆంథ్రోపిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా సుంకాల 15%కి పెంచుతున్నట్టు ప్రకటన

అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాల జీవోను కొట్టివేసిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా సుంకాల రేటును వెంటనే 15%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ట్రూత్ సోషల్ పై సుదీర్ఘ పోస్ట్‌లో కోర్టు తీసుకున్న “హాస్యాస్పదమైన, పేలవంగా రాసిన, అసాధారణమైన అమెరికన్ వ్యతిరేక నిర్ణయం” అని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 10% ప్రపంచ సుంకాన్ని “పూర్తిగా అనుమతి పొందిన, చట్టబద్ధంగా పరీక్షించిన” 15% స్థాయికి పెంచుతామని,”వెంటనే అమలులోకి వస్తుంది”  ఆయన ప్రకటించారు.

గిరిజన సర్పంచ్‌పై అగ్ర కులస్తుల దాడి.. ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు..!

మండల పరిధిలోని రేగుల గడ్డ సర్పంచ్‌ ధనావత్ గుణ నాయక్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. నిరూపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరొక చోట పాతాలని చెప్పినందుకు ఆయనపై దాడికి దిగారు. ‘మా ఇంటి దగ్గర స్తంభాన్ని తరలించాలని చెబుతావా?’ అని చామల ఉపేందర్ రెడ్డి, చామల పెద్ద రామిరెడ్డిలు సర్పంచ్‌పై దాడి చేశారు. వారి దాడిలో సర్పంచ్ గుణ నాయక్‌కు గాయాలయ్యాయి. అవసరమున్న చోట విద్యుత్ స్తంభాల్ని ఏర్పాటు చేయాలనుకుంటే తనపై దాడి చేశారని సర్పంచ్ పోలీసులకు […]

టీ20 ప్రపంచ కప్ 2026: భారీ వర్షం.. న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు

టీ20 ప్రపంచ కప్ 2026లో తొలి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. నేడు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగా న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. టాస్ పడిన సమయంలో వాతావరణం కాస్త మెరుగ్గానే ఉంది. టాస్ నెగ్గిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆట ప్రారంభం అవుతుందనగా.. భారీ వర్షం మొదలైంది. సమయం గడిచేకొద్దీ వర్షం పెరుగుతూనే పోయింది. దీంతో ఆటను నిర్వహించే అవకాశాలే లేకుండా పోయాయి. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

6 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తి.. గుజరాత్‌లో 68 లక్షల ఓటర్ల తొలగింపు

ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయింది. ఆ వివరాలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కంటే గుజరాత్‌లో అత్యధికంగా ఓటర్ల తొలగింపు చోటుచేసుకుంది. రికార్డు స్థాయిలో 68 లక్షల 12 వేల 711 మందిని జాబితా నుంచి తొలగించింది. ఎస్ఐర్ ప్రక్రియకు ముందు 5,08,43,436 మంది ఓటర్లు ఉండగా అది ప్రస్తుతం 4,40,30,725కు తగ్గింది.

వినూత్న నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. సిటీ పోలీసు విభాగంలో 25 ఏళ్లలోపు డిగ్రీ, పిజి విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పించనున్నారు. ఆధునిక పోలీసింగ్‌లో విద్యార్థులను పోలీసులు భాగస్వామ్యం చేయనున్నారు. డేటా అనాలిసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్లు జారీ చేయనున్నారు. ఎస్ఎంఐటి సెల్‌ పర్యవేక్షణలో పోలీసులు దీన్ని అమలు చేయనున్నారు.

ప్రేయసి సోఫీని పెళ్లాడిన శిఖర్ ధావన్- గబ్బర్ సెకండ్ ఇన్నింగ్స్​ షురూ

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రేయసి ఐర్లాండ్​ నటి సోఫీ షైన్‌ను గబ్బర్ పెళ్లాడాడు. వీళ్ల వివాహం ఫిబ్రవరి 21న జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ హాజరయ్యాడు. ధావన్ వివాహంలో సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీతో ధావన్ 2021లో విడాకులు తీసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఒక కొడుకు (జొరావర్) […]

అగ్రికల్చర్ ఏడీ కిరణ్ కుమార్ ఆస్తులు 50 కోట్లు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సుందరి కిరణ్ కుమార్ ఇల్లు, మరో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో100 ఎకరాల వ్యవసాయ భూమి, పది విలువైన ప్లాట్లు, ఐదు ఫోర్ వీలర్ వాహనాలు, ఐదు ట్రాక్టర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 15 కోట్లు అని చెబుతున్నప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ […]

సమిష్టి కృషి వల్లే పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది: సిఎం రేవంత్

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్నెళ్ల తర్వాత జరిగిన ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబంలో 3 తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి సొంత ఇళ్లు కూడా లేదని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే కాంగ్రెస్‌ను కనుమరుగు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON