loader

రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ దంపతులు..

తెలంగాణలో ఇటీవల మంత్రుల మధ్య జరిగే వివాదాలు సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయని తెలిసిందే. మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కొండా సురేఖ దంపతులుతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కొండా సురేఖ దంపతులు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దీపావళి విషెస్ చెప్పడంతో వీరి […]

ఇలా అయితే పార్టీలో మా పరిస్థితి ఏంటి..జీవన్ రెడ్డి అసహనం

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలను బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకే ఇచ్చారని పేర్కొన్నారు. పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులుగా చొప్పదండి […]

టీడీపీలో మరోసారి కొలికపూడి కలకలం- ఎంపీ చిన్నిపై

విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలికపూడి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పదవులు అమ్ముకుంటూ అవినీతి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో పార్టీ పదవులు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో లీడర్లు తిరిగే వాళ్లని ఇప్పుడు ఎంపీ కార్యాలయంలోనే కూర్చొని పదవులు డబ్బులు ఇచ్చే వాళ్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రేషన్ మాఫియా, ఇసుకు మాఫియా నడుపుతూ పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని అన్నారు. ఎంపీ కార్యాలయంలోని మూల్పూరి కిశోర్ చేస్తున్న దందాతో పార్టీ నేతలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం […]

‘మహారాష్ట్రలో 96 లక్షల మంది నకిలీ​ ఓటర్లు’- ECపై రాజ్‌ ఠాక్రే ఫైర్​

మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో 96లక్షల బోగస్ ఓట్లు నమోదైనట్లు ఆరోపించారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే. వీటిని తొలగించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. బోగస్​ ఓట్లతో ఎన్నికలు నిర్వహించడం నిజమైన ఓటర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఎంఎన్​ఎస్​ పార్టీ బూత్​ స్థాయి ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓటర్ జాబితాను పరిశీలించి ఫేక్​ ఓటర్లను కనిపెట్టాలని పార్టీ కార్యకర్తలను కోరారు.

రోడ్డెక్కిన కవిత కుమారుడు ఆదిత్య.. బీసీ రిజర్వేషన్ల కోసం

42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల క‌విత ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పోరాటంలో తల్లి కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య కూడా రోడ్డెక్కారు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన ఆదిత్య.. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే’ అంటూ ఫ్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టిడిపి శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా వైసిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనాన్ని టిడిపి వర్గీయులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్తుండగా తమ వాహనాలపై టిడిపి శ్రేణులు దాడికి పాల్పడ్డారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన మరది వైసిపి ఎంపిపి వెంకట రామిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. వైసిపి నాయకులు గ్రామంలోకి అడుగు పెట్టొద్దని టిడిపి కార్యకర్తలు కెఇ చంద్ర, శ్రీధర్ గౌడ్, నక్క రాజు, మ‌రి కొంతమంది […]

నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా: మంత్రి సీతక్క

‘నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా, నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెపుతున్నా’ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి రాద్దాంతం జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్‌ఎస్ పార్టీయేనని అన్నారు. అబద్ధానికి ఆరడుగుల సాక్ష్యం హరీష్ రావు అంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలోనే రోడ్లపై అడ్వకేట్లను చంపింది బీఆర్‌ఎస్ నేతలేనని అన్నారు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్‌ఎస్ పార్టీనేనని మండిపడ్డారు.

గాంధీనే విడిచి పెట్టలేదు, నేనెంత.. ప్రియాంక్ ఖర్గే

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన సమీకరణల పేరుతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారని, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ వంటి ప్రముఖులకు ఎదురైన చారిత్రక చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ప్రాంగణాల్లో ఇక నుంచి ఎలాంటి సమావేశాలను నిర్వహించ రాదని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘ఆర్ఎస్ఎస్, బీజేపీల స్థాయీ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ఆలోచన.. అత్యంత విషపూరితం చేసే ఆలోచన అని అన్నారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కి ఊరట లభించింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి షరతులతో కూడిన అనుమతిని విజయవాడ ఏసీబీ కోర్టు జారీ చేసింది. రూ.50,000 విలువచేసే రెండు జామీన్లను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్‌లో ఎక్కడ బస చేస్తున్నారనే వివరాలను అందజేయాలని ఆజ్ఞాపించింది న్యాయస్థానం. మిథున్ రెడ్డి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లను కోర్టుకు వెంటనే తెలియజేయాలని ఆదేశించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON