ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా వైసిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనాన్ని టిడిపి వర్గీయులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్తుండగా తమ వాహనాలపై టిడిపి శ్రేణులు దాడికి పాల్పడ్డారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన మరది వైసిపి ఎంపిపి వెంకట రామిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. వైసిపి నాయకులు గ్రామంలోకి అడుగు పెట్టొద్దని టిడిపి కార్యకర్తలు కెఇ చంద్ర, శ్రీధర్ గౌడ్, నక్క రాజు, మరి కొంతమంది రాళ్లతో, కర్రలతో దాడికి పాల్పడ్డారు

