loader

డొనాల్డ్​ ట్రంప్​నకు వ్యతిరేకంగా- అమెరికాలో ‘నో కింగ్స్’​ నిరసనలు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్​ ట్రంప్​ పాలనాతీరుపై ప్రపంచ దేశాలతోపాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ట్రంప్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గతంలో ‘నో కింగ్స్​’ నిరసనలు చేపట్టిన అమెరికన్లు, ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. 50 రాష్ట్రాల్లో దాదాపు 2500లకుపైగా ప్రదేశాల్లో నిరసనలకు చేపట్టనుండగా, పలు ఐరోపా దేశాల్లో వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అమెరికాలో రాజులు లేరని, అవినీతి క్రూరత్వానికి వ్యతిరేక పోరాటంలో వెనక్కి తగ్గమంటూ ప్రత్యేక […]

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ఉద్యోగులు 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ ఎప్పుడైనా వాడుకోవచ్చంటూ చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసులకు ఈఎల్‌కు సంబంధించి ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ 105 కోట్లు నవంబర్‌లో ఇస్తామని, జనవరిలో మరో రూ.105 కోట్లు ఇస్తామని.. 60 రోజుల్లోపు ఉద్యోగుల మెడిక్లెయిమ్ వ్యవస్థను స్ట్రీమ్‌లైన్‌ చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఒక ప్రమోషన్‌కు కూడా.. దీపావళి లోపు క్లియర్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.  పీఆర్సీ విషయంలో వెసలుబాటు కావాలన్నారు.

ఏపీ ఉద్యోగులకు దీపావళి కానుక…ఒక డీఏ విడుదల..సీఎం చంద్రబాబు

ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి డీఏ అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఒక డీఏ విడుదల చేయడం వల్ల రూ.160 కోట్ల వరకు భారం కానుంది అని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఒక డీఏ విడుదల చేయాలని నిర్ణయించినట్లు, అంతేకాదు త్వరలోనే పీఆర్సీపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

ఏపీ ఇంటర్ పాస్ పర్సంటేజీ విధానంలో మార్పులు

2025-26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు జాగ్రఫీ ప్రశ్నపత్రం 75 మార్కులకు ఉంటుంది. మొత్తం 85 మార్కులు చేశారు.జాగ్రఫీని ఎలెక్టివ్ (ఛాయిస్) సబ్జెక్టుగా పరిగణిస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రంతో సమానంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. జాగ్రఫీ ప్రాక్టికల్ పరీక్షలకు, 50 మార్కుల నుంచి 30 మార్కులకు తగ్గించారు. ప్రాక్టికల్ పరీక్షలో కనీసం 35% అంటే 11 మార్కులు, 30% అంటే 9 మార్కులుగా పరిగణిస్తారు.

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (BPS) పథకానికి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం చట్టాన్ని సవరించి గెజిట్ విడుదల చేసింది. 2019లో రాష్ట్రం బిల్డింగ్ పెర్మిషన్ స్కీమ్ (BPS) ద్వారా 2018 ఆగస్టు 31 వరకు ఉన్న నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి అవకాశం కల్పించింది. తాజాగా ప్రభుత్వం కొత్త గెజిట్ ప్రకారం, ఈ నిర్మాణాల క్రమబద్ధీకరణకు కటాఫ్ తేదీని 2025 ఆగస్టు 31 వరకు పొడిగించింది. అంటే ఆ తేదీ లోపల నిర్మాణం […]

మైనర్లతో అసభ్య కంటెంట్ -రెండు యూట్యూబ్ చానల్స్ పై పోక్సో

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చానల్స్ పై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం కింద కేసు నమోదు అయింది. మైనర్లను ఉపయోగించి లైక్‌లు , వ్యూస్ సాధించే ప్రయత్నాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి కంటెంట్ చూసిన వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు రిపోర్ట్ చేయాలి లేదా 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో […]

గ్రూప్-2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం

గ్రూప్-2 పరీక్షలో విజేతలకు ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్న సీఎం.. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి ఆదర్శంగా నిలవాలి.’ అని కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారిని […]

ఈ సారి భిన్నంగా మూరత్‌ ట్రేడింగ్‌..! దీపావళి స్పెషల్‌ ట్రేడింగ్‌

సాధారణంగా దీపావళి రోజున జరిగే స్టాక్ మార్కెట్ మూరత్‌ ట్రేడింగ్ సెషన్ ఈ ఏడాది మధ్యాహ్నం జరుగనున్నది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్క్యులర్‌ జారీ చేశాయి. సర్క్యులర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం మూరత్‌ ట్రేడింగ్ సాయంత్రం జరిగేది. కానీ, ఈ సారి మాత్రం దీపావళి మూరత్‌ ట్రేడింగ్‌ ఈ నెల 21న మధ్యాహ్నం 1.45గంటల నుంచి 2.45 గంటల వరకు జరుగుతుందని సర్క్యూలర్‌లో ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది.

విమానం గాల్లో ఉండగానే మంటలు.. చూస్తుండగానే..

చైనాకు చెందిన ఎయిర్ చైనా విమానం సీఎ139 శుక్రవారం హాంగ్‌చౌ నుంచి సియోల్ బయలు దేరింది. ఈ నేపథ్యంలోనే విమానం క్యాబిన్‌లోని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో లిథియమ్ బ్యాటరీ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో విమానంలో ఉన్న వారంత భయంతో అరుపులు, కేకలు పెట్టారు. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటల్ని ఆర్పారు. వెంటనే సిబ్బంది విమానం షాంగైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కానీ విమానంలో ఉన్న వారంత తెగ టెన్షన్ కు గురయ్యారు. లక్ […]

ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..8మంది మృతి

మహారాష్ట్రలోని చాంద్‌షాలి ఘాట్‌ వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అస్తంబా దేవీ యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల పికప్ వ్యాను ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం అంత భయంకరంగా ఉండటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సాక్షుల ప్రకారం, వ్యాను అధిక వేగంతో వెళ్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలోకి దూసుకుపోయిందని చెబుతున్నారు. ప్రమాద స్థలంలోనే 8మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8మందికి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON