loader

కాల్పుల విమరణకు తూట్లు.. అఫ్గనిస్థాన్‌పై గగనతల దాడులకు పాల్పడిన పాక్..!

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. అఫ్గనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా గగనతల దాడులకు పాల్పడింది. ఇరుదేశాల మధ్య కుదిరిన రెండు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది దేశం. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడిందని శుక్రవారం తాలిబన్ సీనియర్ నేత ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్‌ (AFP)తో వెల్లడించారు. తాము పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.

చెన్నై ఓపెన్‌లో యువకెరటాలు.. రాజేశ్వరన్, యమలపల్లికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ

జూనియర్ స్థాయిలో అదరగొడుతున్న యువ క్రీడాకారిణులకు మాయా రాజేశ్వరన్, సహజ యమలపల్లి కి మరో మెగా టోర్నీ అవకాశం దక్కింది. స్వదేశంలో జరుగబోయే చెన్నై ఓపెన్‌లో ఇద్దరికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. డబ్ల్యూటీఏ 250 టోర్నీ చెన్నై ఓపెన్ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకూ జరుగనుంది. స్పెయిన్‌లోని రఫెన్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయా రాజేశ్వరన్ జూనియర్ లెవల్లో చెలరేగిపోతోంది. సహజ యమలపల్లి కూడా ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉంది.

విద్యుత్‌ యాజమాన్యంతో జేఏసీ చర్చలు విఫలం

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు డిమాండ్లతో విద్యుత్‌ యాజమాన్యంతో జరిగిన జేఏపీ చర్చలు విఫలమయ్యాయి. ప్రధానంగా కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అంశంపై విద్యుత్‌ యాజమాన్యం ఎటు తేల్చకపోవడంతో చర్చలు పలప్రదం కాలేదు. దాంతో విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. విద్యుత్‌ ఉద్యోగులు సమ్మె అంశానికి సంబంధించి కాసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. విద్యుత్‌ యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె దిశగా .జేఏసీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

భారత క్రికెట్ సంఘం అధ్యక్షురాలిగా మాజీ కెప్టెన్..

భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి కీలక పదవికి ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భారత క్రికెట్ సంఘం(ICA) అధ్యక్షురాలిగా రంగస్వామి ఎన్నికయ్యారు. ఢిల్లీ మాజీ ఓపెనర్ వెంకట్ సుందరం కార్యదర్శిగా .. దీపక్ జైన్ కోశాధికారిగా,జ్యోతి థాటే, సంతోష్ సుబ్రమణియన్‌లు ఐసీఏ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన రంగస్వామి భారత క్రికెట్‌లో దిగ్గజ ప్లేయర్. మహిళల జట్టుకు తొలి కెప్టెన్‌గా పేరొందిన ఆమె.. 1976 నుంచి 1991 మధ్య కాలంలో ఇండియాకు ప్రాతినిధ్యం […]

ONGCలో భారీ నోటిఫికేషన్.. టెన్త్, ITI పాసైన వారికి

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఈ సంవత్సరం మొత్తం 2623 అప్రెంటిస్ పోస్టుల నియామకానికి అధికారికంగా ఆహ్వానం పలికింది. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు అక్టోబర్ 16, నుండి  నవంబర్ 6, 2025 వరకు స్వీకరించబడతాయి. అభ్యర్థుల విద్యార్హతలో గ్రాడ్యుయేట్, B.Com, B.Sc, డిప్లొమా, ITI, 10వ తరగతి ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు. అధికారిక సమాచారానికి మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కోసం ONGC అధికారిక […]

నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా: మంత్రి సీతక్క

‘నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా, నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెపుతున్నా’ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి రాద్దాంతం జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్‌ఎస్ పార్టీయేనని అన్నారు. అబద్ధానికి ఆరడుగుల సాక్ష్యం హరీష్ రావు అంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలోనే రోడ్లపై అడ్వకేట్లను చంపింది బీఆర్‌ఎస్ నేతలేనని అన్నారు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్‌ఎస్ పార్టీనేనని మండిపడ్డారు.

రేవంత్ హయాంలో గన్ కల్చర్.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలపై కేంద్రదర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే తుపాకీ పంపించారని, తమ్ముళ్ల కోసం ఫైల్స్ ఆపుతున్నారని ఆరోపించారు.  రేవంత్ రెడ్డి కేబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరిగా తయారైందని ఎద్దేవా చేశారు.

గాంధీనే విడిచి పెట్టలేదు, నేనెంత.. ప్రియాంక్ ఖర్గే

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన సమీకరణల పేరుతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారని, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ వంటి ప్రముఖులకు ఎదురైన చారిత్రక చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ప్రాంగణాల్లో ఇక నుంచి ఎలాంటి సమావేశాలను నిర్వహించ రాదని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘ఆర్ఎస్ఎస్, బీజేపీల స్థాయీ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ఆలోచన.. అత్యంత విషపూరితం చేసే ఆలోచన అని అన్నారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కి ఊరట లభించింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి షరతులతో కూడిన అనుమతిని విజయవాడ ఏసీబీ కోర్టు జారీ చేసింది. రూ.50,000 విలువచేసే రెండు జామీన్లను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్‌లో ఎక్కడ బస చేస్తున్నారనే వివరాలను అందజేయాలని ఆజ్ఞాపించింది న్యాయస్థానం. మిథున్ రెడ్డి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లను కోర్టుకు వెంటనే తెలియజేయాలని ఆదేశించింది.

రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేస్తాం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం’ అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన నిర్వహించనుందని చెప్పుకొచ్చారు. యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు QR కోడ్ స్కాన్ చేసి, లేదా లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON