రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలపై కేంద్రదర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే తుపాకీ పంపించారని, తమ్ముళ్ల కోసం ఫైల్స్ ఆపుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరిగా తయారైందని ఎద్దేవా చేశారు.

