తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని సర్వేలు డీఎంకే కూటమిదే మళ్లీ అధికారమని అంచనా వేశాయి. కానీ, ఒక్క సంస్థ మాత్రం యాక్సిస్ మై ఇండియా సర్వే విజయ్ పార్టీ సునామీ తథ్యమని జోస్యం చెప్పింది.టీవీకే 98 నుంచి 120 స్థానాలు. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో యాక్సిస్ మై ఇండియా సర్వేలు నిజమయ్యాయి. గతంలో ఐదు సందర్భాల్లో మిగతా సంస్థలకు భిన్నంగా దీని అంచనాలు, ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి.

