హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరమైంది. ఎల్ అండ్ టీతో షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రక్రియ పూర్తయ్యింది. రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ జరిగింది. ఎల్ అండ్ టీ, మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ 2017 నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్వర్క్ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-Iను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

