ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్లైన్లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకు వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని చెప్పారు. ఆర్టీజీఎస్పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మనమిత్ర వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రస్తుతం 1,035 సేవలు అందిస్తున్నామని తెలిపారు.

