సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోనే ప్రజలకు తాగునీటి వసతి కరువైంది. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ప్రజలు, ఉద్యోగులు, అధికారులతో సందడిగా ఉంటుంది. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమానికి దాదాపు వందల సంఖ్యలో జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చి తమ సమస్యలను అధికారులుకు చెప్పకునే వారికి గుప్పెడు తాగునీటి సౌకర్యం కుడా లేని పరిస్థితి నెలకొంది.పనుల కోసం వచ్చే ప్రజలు, కిందిస్థాయి ఉద్యోగులు తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.

