IPL 2026లో నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ ర్యాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ వినియోగిస్తూ కెమెరాకు చిక్కడం, అతని అరెస్టు తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టం (PECA) 2019 ప్రకారం..నేరం రుజువైతే రియాన్ పరాగ్ కు రూ.లక్ష జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. స్టేడియంలో వంటి బహిరంగ ప్రదేశాలలో ధూమపానం లేదా వేపింగ్ చేయడం నేరపూరితమైనది. రియాన్ పరాగ్‌పై కొన్ని మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది.

