ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం కోసం అమెరికా ఇప్పటివరకు 25 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.30లక్షల కోట్లు) ఖర్చు చేసిందని పెంటగాన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యుద్ధానికి సంబంధించి సైన్యం వెచ్చించిన వ్యయంపై ఇదే తొలి అధికారిక అంచనా. పెంటగాన్ కంప్ట్రోలర్ జూల్స్.. హౌస్ ఆర్మ్స్ సర్వీసెస్ కమిటీలోని చట్టసభ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో అధిక భాగం ఆయుధ సామగ్రి కోసమే ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

